: ఎన్ఆర్ఐ వివాహాల్లో మోసాలకు చెక్.. పెళ్లి రిజిస్ట్రేషన్‌కు ఆధార్ తప్పనిసరి!

ఎన్ఆర్ఐ వివాహాల పేర జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇక నుంచి ఎన్ఆర్ఐ వివాహాల రిజిస్ట్రేషన్‌కు ఆధార్ నంబరును తప్పనిసరి చేయాలని నిపుణుల కమిటీ కేంద్రానికి ప్రతిపాదించింది. ఎన్ఆర్ఐ సంబంధం అనగానే ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచించకుండా తమ అమ్మాయిని ఇచ్చి పెళ్లిళ్లు చేసేస్తున్నారు. అనంతరం వారి అసలు రంగు బయటపడడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటున్నారు.

ఇకపై ఇటువంటివి జరగకుండా అరికట్టేందుకు రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్‌ను తప్పనిసరి చేయాలని విదేశాంగ శాఖకు నిపుణుల కమిటీ ప్రతిపాదనలు అందజేసింది. వివాహమైన తర్వాత భార్యను వదిలేసి వెళ్తున్న ఎన్‌ఆర్ఐలను పట్టుకునేందుకు, అదనపు కట్నం, గృహ హింస తదితర వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణుల కమిటీ పేర్కొంది. 2005 నుంచి 2012 మధ్య ఇటువంటివి 1300 కేసులు  ఎన్ఆర్ఐ సెల్‌లో నమోదయ్యాయి. అయితే ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డు లేకపోవడంతో ఈ కేసుల పరిష్కారం ఇబ్బందిగా మారుతోంది. దీంతో ఇకపై అలా జరగకుండా ఉండేందుకు కేంద్రం ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది.

More Telugu News