: మొన్నటిదాకా డెడ్ స్టోరేజ్.. ఇప్పుడు 835 అడుగులకు పెరిగిన శ్రీశైలం నీటిమట్టం!

మొన్నటి దాకా డెడ్ స్టోరేజ్ స్థాయి వద్ద ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో జలమట్టం పెరిగింది. ఎగువన కురిసిన వర్షాల కారణంగా డ్యాంకు వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 49 టీఎంసీల నీరు ఉంది. నీటి మట్టం 835 అడుగులుగా ఉంది. ప్రస్తుత ఇన్ ఫ్లో 18270 క్యూసెక్కులు కాగా, 30599 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో 3 యూనిట్ల ద్వారా, కుడి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో 2 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

More Telugu News