srivalli: 'శ్రీవల్లి' కథ ఆ బాధలో నుంచి పుట్టింది.. నా వ్యక్తిగత అనుభవం అది!: విజయేంద్ర ప్రసాద్

విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసుకుని .. దర్శకత్వం వహించిన చిత్రమే 'శ్రీవల్లి'. ఈ సినిమా ఈ నెల 15వ తేదీన థియేటర్లకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడారు. మనసు .. ఆలోచనలకి సంబంధించిన మానసిక విశ్లేషణగా ఈ కథ కొనసాగుతుందని చెప్పారు.

 తనకి వైజాగ్ లో రమేశ్ అనే మిత్రుడు ఉండేవాడనీ, 2010లో వినాయక చవితి ముందురోజు ఆ మిత్రుడిని చూడాలని తనకి ఎంతగానో అనిపించిందని అన్నారు. మనసు ఆయన వైపే లాగిందని చెప్పారు. అయితే అప్పుడు వెళ్లలేకపోయిన తాను, ఆ తరువాత రెండేళ్లకు వైజాగ్ లో ఆయన ఇంటికి వెళ్లానని అన్నారు. అయితే తన మిత్రుడు 2010లో వినాయక చవితి ముందు రోజు చనిపోయాడనీ, చివరి క్షణాల్లో తనని ఎంతగానో తలచుకున్నాడని ఆ కుటుంబ సభ్యులు చెప్పారని అన్నారు. తనని తన మిత్రుడు తలచుకున్నప్పుడే .. తన మనసు ఆయన వైపుకు ఎందుకు లాగింది? అనే ఆలోచనలో నుంచి .. ఆ బాధలో నుంచి ఈ కథ పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.  

More Telugu News