bellamkonda: బెల్లంకొండ సాహసాలు.. డూప్ లేకుండా ఫైట్స్ చేసేశాడట!

'జయ జానకి నాయక' సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాంచి ఉత్సాహంతో వున్నాడు. ప్రస్తుతం ఆయన శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు. ఈ సినిమాను గురించి నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోందని చెప్పారు.

 ఇప్పటికి  రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయనీ, తాజా షెడ్యూల్ ను పొల్లాచిలో చిత్రీకరించామని అన్నారు. 15 రోజుల పాటు పీటర్ హెయిన్స్ అధ్వర్యంలో యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించడం జరిగిందని చెప్పారు. భారీ సెట్ లో చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ లో శ్రీనివాస్ డూప్ లేకుండా పాల్గొన్నాడనీ .. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.      

  • Loading...

More Telugu News