sampurnesh babu: మహేశ్ కత్తి ధోరణి పట్ల సంపూ కామెంట్!

పవన్ కల్యాణ్ గురించి కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కత్తి మహేశ్ తీరు సరైనది కాదంటూ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో సంపూర్ణేష్ బాబు కూడా చేరిపోయాడు. వాక్ స్వాతంత్య్రం ఎవరికైనా ఉంటుంది .. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నామో .. ఏం మాట్లాడుతున్నామో తెలుసుకుని మాట్లాడాలని సంపూ అన్నాడు.

 ఒక విషయంపై ఎవరైనా తమ అభిప్రాయం చెప్పొచ్చు .. కానీ అలా చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుందని చెప్పాడు. పవన్ కల్యాణ్ మంచి నటుడు కాకపోతే .. ఇన్ని కోట్ల మంది మనసులను గెలవడం ఎలా సాధ్యమని అడిగాడు. పవన్ విషయంలో మహేశ్ కత్తి అలా మాట్లాడి ఉండకూడదనీ, ఆయన ధోరణి తనకి చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు.    
sampurnesh babu

More Telugu News