: 'ఐఫోన్ ఎక్స్' కోసం ప‌ది రోజుల ముందే షాపు ముందు కూర్చున్న యువ‌కుడు!

యువ‌తలో ఆపిల్ ఐఫోన్ల‌కు ఉన్న క్రేజే వేరు. ప్ర‌త్యేకంగా తాము ఐఫోన్ వాడుతున్నామ‌ని చూపించుకోవ‌డానికి అద్దంలో సెల్ఫీ దిగి సోష‌ల్‌మీడియాలో అప్‌లోడ్ చేస్తారు. వారికి త‌గ్గ‌ట్లుగానే ఆపిల్ సంస్థ కూడా ప్ర‌తి మోడ‌ల్‌లో ఓ కొత్త ఫీచ‌ర్‌తో ఆక‌ర్షక స‌దుపాయాలు క‌ల్పిస్తోంది. అందుకే ఇవాళ అర్థ‌రాత్రి కాలిఫోర్నియాలో విడుద‌ల కానున్న ఐఫోన్ ఎక్స్ కోసం చాలా మంది యువ‌త ఎదురుచూస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన మేజెన్ అనే యువ‌కుడు కూడా అక్క‌డి ఆపిల్ స్టోర్ ముందు ఎదురుచూస్తున్నాడు.

ఇక్క‌డ ప్ర‌త్యేక‌త ఏంటంటే... ఆస్ట్రేలియా మార్కెట్‌లో ఈ ఐఫోన్ ఎక్స్ సెప్టెంబ‌ర్ 22న విడుద‌ల‌కానుంది. అంటే మేజెన్ ప‌ది రోజుల ముందే ఆపిల్ స్టోర్ ద‌గ్గ‌రికి వ‌చ్చాడ‌న్న‌మాట‌. యూనివర్శిటీ ఆఫ్‌ న్యూసౌత్‌ వేల్స్‌లో ఇంజినీరింగ్‌ చదువుతున్న మేజెన్‌కు ఐఫోన్ అంటే పిచ్చి. ఎలాగైనా ఐఫోన్ ఎక్స్‌ను తానే మొద‌ట కొనుగోలు చేయాల‌ని ఆరాట‌ప‌డుతున్నాడు. అందుకే ప‌ది రోజుల ముందే స్టోర్ ద‌గ్గ‌రికి వ‌చ్చిన‌ట్లు మేజెన్ తెలిపాడు. గతేడాది ఐఫోన్‌ 7 విడుదలైన‌పుడు కూడా ఇలాగే ఎదురుచూసి, దాన్ని కొనుగోలు చేసిన మూడో వ్య‌క్తిగా నిలిచాడు. ఐఫోన్‌ ఎక్స్‌ను మొద‌ట‌ కొనుగోలు చేస్తున్న వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాన‌ని మేజెన్ చెబుతున్నాడు. ఉదయం పూట షోరూం ముందు మేజెన్‌ కూర్చుని, రాత్రి పూట తన స్నేహితులను కూర్చోబెడుతున్నాడు. అంతేకాదండోయ్‌.. యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో మేజెన్‌ రూపొందించిన ఎనిమిది యాప్స్‌ కూడా ఉన్నాయట. యాపిల్‌ వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ నుంచి మేజెన్‌ రెండు సార్లు స్కాలర్‌షిప్‌ను కూడా గెలుచుకున్నాడు.

More Telugu News