ajith: 'వివేగం' హిట్ జాబితాలో చేరనట్టేనా?

అజిత్ హీరోగా .. కాజల్ కథానాయికగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు 'వివేగం' వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయడం వలన, రెండు వారాల్లోనే ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ ను సాధించిందని ప్రకటించారు. దాంతో ఈ సినిమా సూపర్ హిట్ అంటూ అజిత్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

 ఇక గ్రాస్ విషయాన్ని పక్కన పెట్టేసి షేర్ ను పరిగణనలోకి తీసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన షేర్ 80 కోట్లని చెబుతున్నారు. ఆ రకంగా చూసుకుంటే ఈ సినిమా హిట్ జాబితాలోకి చేరనట్టేననే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ హక్కులను 55 కోట్లకి అమ్మారు. ఇంతవరకూ వచ్చింది 30 కోట్ల షేర్ ను దాటింది. ఫుల్ రన్ లో మరో 5 కోట్లను అదనంగా రాబట్టవచ్చనీ, మిగతాది నష్టపోయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా షేర్ పరంగా చూసుకుంటే ఈ సినిమా నష్టాలను మిగల్చనున్నట్టు చెప్పుకుంటున్నారు.     

More Telugu News