karthi: రకుల్ క్రేజ్ 'ఖాకి' మూవీకి కలిసొచ్చేనా?

తెలుగులో అగ్రకథానాయికగా దూసుకుపోతోన్న రకుల్, తమిళంలోను ఆ స్థానాన్ని అందిపుచ్చుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆమె కార్తీ సరసన 'ధీరన్ అధిగారమ్ ఒండ్రు' సినిమా చేసింది. 'సతురంగ వేట్టై' వంటి సూపర్ హిట్ ను అందించిన దర్శకుడు వినోద్ .. ఈ సినిమాను తెరకెక్కించాడు. 2005లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

 ఈ సినిమాలో కార్తీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. తెలుగులో ఈ సినిమాకి 'ఖాకి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకే రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 18 అయితే అన్ని విధాలా బాగుంటుందని భావిస్తున్నారు. తెలుగులో రకుల్ కి గల క్రేజ్ ఈ సినిమాకి బాగా కలిసొస్తుందనే టాక్ వినిపిస్తోంది.   

More Telugu News