vijay devarakonda: టాప్ టెన్ లో చోటు దక్కించుకున్న 'అర్జున్ రెడ్డి'

విడుదలకి ముందే యూత్ లో విపరీతమైన ఆసక్తిని పెంచేసిన 'అర్జున్ రెడ్డి' .. విడుదల తరువాత వాళ్ల అంచనాలను మించిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. అలా ఓవర్సీస్ లో ఇంతవరకూ అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ టెన్ తెలుగు చిత్రాల్లో 'అర్జున్ రెడ్డి' స్థానాన్ని సంపాదించుకుంది.

 తాజాగా ఈ సినిమా 'శాతకర్ణి' వసూళ్లను అధిగమించింది. 'శాతకర్ణి' లైఫ్ టైమ్ వసూళ్లు 1.66 మిలియన్ డాలర్లు ఉండగా, తాజాగా 'అర్జున్ రెడ్డి' 1.68 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. 'శాతకర్ణి' కంటే ముందు స్థానాల్లో 'జనతా గ్యారేజ్' .. 'అత్తారింటికి దారేది' చిత్రాలు వున్నాయి. ఫుల్ రన్ లో 'అర్జున్ రెడ్డి' సినిమా ఆ రికార్డులను కూడా అధిగమించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.   
vijay devarakonda
shalini

More Telugu News