shraddha kapoor: నా కెరియర్లో ఛాలెంజింగ్ గా చేసిన పాత్ర ఇదే : శ్రద్ధా కపూర్

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్ సోదరి జీవిత చరిత్ర ఆధారంగా 'హసీనా పార్కర్' తెరకెక్కింది. మాఫియా డాన్ గా దావూద్ ఎదగడంలో ఆమె పాత్ర చాలా కీలకమైనదని అంటారు. దావూద్ కన్నా ఆమె జీవితంలోని ఆసక్తికరమైన విశేషాలే ఎక్కువని చెబుతారు. అలాంటి 'హసీనా పార్కర్' జీవిత చరిత్రను, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రగా అపూర్వ లఖియా తెరకెక్కించాడు.

 ఈ సినిమా ఈ నెల 22వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ .. తన కెరియర్లో ఎంతో ఛాలెంజింగ్ గా చేసిన పాత్ర ఇదేనని చెప్పింది. నటిగా తన సత్తాను చాటే పాత్ర ఇదని అంది. దావూద్ ఇబ్రహీమ్ పాత్రలో సిద్ధాంత్ నటించాడు. నిజజీవితంలో బ్రదర్ .. సిస్టర్ రిలేషన్ వున్న సిద్ధాంత్ .. శ్రద్ధా .. ఈ సినిమాలో అదే రిలేషన్ గల పాత్రలను పోషించడం విశేషం.     
shraddha kapoor

More Telugu News