: పోటెత్తిన కృష్ణమ్మ... జూరాలకు 40 వేలు, శ్రీశైలానికి 30 వేల క్యూసెక్కుల వరద

ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పోటెత్తింది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండుకోగా, ఈ ప్రాజెక్టులకు వస్తున్న వరదను వస్తున్నది వస్తున్నట్టు దిగువకు వదులుతున్నారు. ఈ ఉదయం ఆల్మట్టికి 11,023, నారాయణపూర్ కు 11,302, జూరాలకు 39,705 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. ఆ నీరంతటినీ కాలువల ద్వారా పంట పొలాలకు, ఆపై శ్రీశైలం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు.

శ్రీశైలానికి ప్రస్తుతం 28,962 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 12 గంటల వ్యవధిలో మూడున్నర టీఎంసీల నీరు ప్రాజెక్టులో చేరింది. శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.18 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 39.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. మిగతా రిజర్వాయర్లలో చెప్పుకోతగినంత నీటి ప్రవాహం లేదు.

More Telugu News