: శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలను ప్రకటించిన టీటీడీ

ఈ సంవత్సరం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. 22న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని, 23న రాత్రి 7 గంటలకు ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. అదే రోజు రాత్రి 8 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ తెలిపింది.

రాత్రి 9 గంటలకు పెద శేషవాహన సేవ ఉంటుందని, ఆపై వరుసగా నిత్యమూ రెండు వాహన సేవలు ఉంటాయని వెల్లడించింది. 27వ తేదీ రాత్రి 7 గంటలకు గరుడవాహన సేవ ఉంటుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ చేశామని తెలియజేసింది. 28న సాయంత్రం 5 గంటలకు స్వర్ణ రథోత్సవం, గజవాహన సేవలుంటాయని, 30న రథోత్సవం, అక్టోబర్ 1న ఉదయం చక్రస్నానం, ఆపై సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఓ ప్రకటనలో వెల్లడించింది.

More Telugu News