murugadoos: ఓ అమీర్ ఖాన్ .. ఓ మహేశ్ బాబు : మురుగదాస్

షార్ట్స్‌లో చూడండి
'స్పైడర్' సినిమా ఆడియో వేడుక నిన్న సాయంత్రం చెన్నైలో భారీస్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేదికపై దర్శకుడు మురుగదాస్ మాట్లాడుతూ, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో మహేశ్ బాబును పోల్చారు. అమీర్ ఖాన్ తో తాను 'గజని' సినిమా చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 'గజని' సినిమా షూటింగ్ సమయంలో అమీర్ ఖాన్ ఎంతో కష్టపడేవారనీ, అయినా ఎంతో సహనాన్ని పాటిస్తూ .. అవసరమైతే మరిన్ని కాల్షీట్లు తీసుకోండి అనేవారని చెప్పారు.

 అదే మాటను మళ్లీ 'స్పైడర్' సినిమా షూటింగ్ సమయంలో మహేశ్ నోటివెంట విన్నానని అన్నారు. హార్డ్ వర్క్ విషయంలో ఈ ఇద్దరూ ఒకటేనని చెప్పారు. ఈ సినిమా కోసం 80 రోజుల పాటు రాత్రి వేళలో మహేశ్ తో షూటింగ్ చేశామనీ, అప్పుడు ఆయన అందించిన సహకారం మరువలేదని అన్నారు. తాను ఒక సూపర్ స్టార్ ననే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కలిసి పనిచేయడం మహేశ్ గొప్పతనమని చెప్పుకొచ్చారు.     
Go Back to Shorts
murugadoos

More Telugu News