: మాడిసన్ కీస్ ను మట్టికరిపించి యూఎస్ ఓపెన్ టైటిల్ ఎగరేసుకుపోయిన స్లోన్ స్టీఫెన్స్

15 సంవత్సరాల తరువాత ఇద్దరు అమెరికన్ క్రీడాకారిణుల మధ్య యూఎస్ ఓపెన్ ఫైనల్ పోరు జరుగగా, ఆన్ సీడెడ్ గా బరిలోకి దిగి టైటిల్ గెలుచుకున్న ఐదో యువతిగా స్లోన్ స్టీఫెన్స్ నిలిచింది. కొద్దిసేపటి క్రితం ముగిసిన పోరులో 15వ సీడ్ క్రీడాకారిణి మాడిసన్ కీస్ ను మట్టి కరిపించింది. 6-3, 6-0 తేడాతో ఘన విజయం సాధించింది. మాడిసన్ నుంచి ఎలాంటి పోటీ ఎదురుకాకపోవడంతో స్టీఫెన్స్ గెలుపు నల్లేరుపై నడకైంది.

తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ ను ఆమె దక్కించుకుంది. మాడిసన్ కీస్ 17 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ఈ గెలుపుతో స్టీఫెన్స్ కు 3.7 మిలియన్ యూరోలు బహుమతిగా అందనున్నాయి. కాగా, 2002లో విలియమ్స్ సోదరీమణులు ఫైనల్ పోరు ఆడగా, వీనస్ ను సెరెనా ఓడించిన సంగతి తెలిసిందే. ఆపై మరోమారు ఇద్దరు అమెరికన్లు ఫైనల్ ఆడటం ఇదే తొలిసారి.

More Telugu News