vijay devarakonda: 'జై లవ కుశ' వచ్చేవరకూ 'అర్జున్ రెడ్డి'దే హవా!

'అర్జున్ రెడ్డి' థియేటర్స్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ సినిమా దూకుడికి అడ్డు లేకుండా పోయింది. ఈ సినిమా వసూళ్లపై 'పైసా వసూల్' కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక రీసెంట్ గా థియేటర్స్ కి వచ్చిన నాగ చైతన్య 'యుద్ధం శరణం' ..  అల్లరి నరేశ్ 'మేడ మీద అబ్బాయి' సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయని వార్తలొస్తున్నాయి.

 ఈ రెండు సినిమాలు 'అర్జున్ రెడ్డి'కి ఎంతమాత్రం పోటీగా నిలబడలేకపోయాయి. దాంతో 'అర్జున్ రెడ్డి' జోరు కొనసాగుతూనే వుంది. ఇప్పట్లో రంగంలోకి దిగే చెప్పుకోదగిన సినిమాలు కూడా ఏమీ లేవు. అందువలన 'జై లవ కుశ' విడుదలయ్యేంత వరకూ 'అర్జున్ రెడ్డి' వసూళ్ల హవా కొనసాగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
vijay devarakonda
shalini

More Telugu News