ntr: ఇకపై అలా చేయవద్దంటూ కల్యాణ్ రామ్ కి ఎన్టీఆర్ సలహా!

ఎన్టీఆర్ కథానాయకుడిగా కల్యాణ్ రామ్ 'జై లవకుశ' సినిమాను నిర్మించాడు. ఈ సినిమా 60 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిందనే టాక్ వినిపిస్తోంది. అన్నీ కలుపుకుని 100 కోట్ల వరకూ బిజినెస్ చేసిందని అంటున్నారు. దాదాపు 40 కోట్లకి పైగానే ఈ సినిమాతో కల్యాణ్ రామ్ కి మిగలనుందని చెబుతున్నారు.

 నిర్మాతగా ఇంతకు ముందు కల్యాణ్ రామ్ చేసిన సినిమాలు దెబ్బతిన్నాయి. అందువలన ఆయన నష్టాల పాలయ్యాడు. వాటి నుంచి 'జై లవ కుశ' గట్టెక్కించినట్టేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి ఎన్టీఆర్ ఒక సలహా ఇచ్చినట్టు సమాచారం. ఏదో ఒక ప్రాజెక్టు చేయాలి గదా అని ఏదో ఒక సినిమా చేసి చేతులు కాల్చుకోవద్దని ఎన్టీఆర్ చెప్పాడట. పవర్ ఫుల్  సబ్జెక్ట్ .. క్రేజీ కాంబినేషన్ కుదిరితే తప్ప నిర్మాణం ఆలోచనలు పెట్టుకోవద్దనీ, సాధ్యమైనంత వరకూ హీరోగా ముందుకెళ్లడానికే ప్రయత్నించమని చెప్పినట్టు ఫిల్మ్ నగర్ టాక్.  
ntr
kalyan ram

More Telugu News