lavanya tripathi: లావణ్య త్రిపాఠి తప్పుకోవడానికి దర్శకుడితో విభేదాలే కారణమా?

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై విజయ్ దేవరకొండ కథానాయకుడిగా దర్శకుడు పరశురామ్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా కొంత జరిగింది. లావణ్య త్రిపాఠి కాంబినేషన్లోని కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు. తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి లావణ్య త్రిపాఠి తప్పుకుందనే వార్త బయటికి వచ్చింది. ఆమె ప్లేస్ లోకి రష్మిక మందన కూడా వచ్చేసింది.

పారితోషికం ఎక్కువ డిమాండ్ చేయడం వల్లనే లావణ్య త్రిపాఠిని తప్పించేశారనే టాక్ వచ్చింది. అయితే, అసలు కారణం అది కాదనీ .. దర్శకుడు పరశురామ్ తో ఏర్పడిన విభేదాల కారణంగానే లావణ్య త్రిపాఠి పక్కకి తప్పుకుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే బ్యానర్లో పరశురామ్ దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి 'శ్రీరస్తు శుభమస్తు' చేసింది. అలాంటిది హఠాత్తుగా వీరిద్దరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయనేది ఆసక్తికరంగా మారింది.     
lavanya tripathi

More Telugu News