venkatesh: నాగ్, చైతూలకు హిట్స్ ఇచ్చిన దర్శకుడితో వెంకటేశ్!

'సోగ్గాడే చిన్ని నాయనా'తో నాగార్జునకు .. 'రారండోయ్ వేడుక చూద్దాం'తో నాగ చైతన్యకు దర్శకుడు కల్యాణ్ కృష్ణ హిట్స్ ఇచ్చాడు. తాజాగా ఆయన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేసుకుని వెళ్లి వెంకటేశ్ కి వినిపించాడు. ఆ కథ ఆయనకి బాగా నచ్చేసిందని సమాచారం. ఈ కథలో యంగ్ హీరో చేయాల్సిన పాత్ర ఒకటి ఉండటంతో, ఎవరితో చేయించాలా? అనే ఆలోచనలో దర్శకుడు వున్నాడట.

 ఆ పాత్రకి చైతూ అయితే బాగుంటాడని వెంకటేశ్ చెప్పడమే కాకుండా .. చైతూకి ఫోన్ చేసి ఒప్పించాడట. తనకి హిట్ ఇచ్చిన దర్శకుడి సినిమా కావడం .. తనని అడిగింది మేనమామే కావడం వలన చైతూ వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఓ రకంగా ఇది మల్టీ స్టారర్ అనే అనుకోవాలి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి.  
venkatesh
chaithu

More Telugu News