vijay antony: విజయ్ ఆంటోని సరసన అంజలి!

'బిచ్చగాడు' సినిమాతో తమిళ .. తెలుగు భాషల్లో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోని, ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్నాడు .. దాని పేరే 'కాళి'. ఈ సినిమాలో నలుగురు కథానాయికలు వుంటారు. ఆ నలుగురిలో అంజలి కూడా ఒక నాయిక. మిగతా నాయికలుగా సునైన .. అమృత .. శిల్పా మంజూనాథ్ నటిస్తున్నారు.

 కృతికా ఉదయనిధి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇటీవల కాలంలో అంజలికి తెలుగులో అవకాశాలు బాగా తగ్గాయి. ఇక తమిళంలోను అవకాశాలు పల్చబడ్డాయి. దాంతో ఈ రెండు భాషల్లోను ఈ సినిమా తనకి బాగా హెల్ప్ అవుతుందని అంజలి ఆశ పడుతోంది. ఆమె ఆశ నెరవేరుతుందేమో చూడాలి.       

More Telugu News