nagachaitanya: 'సవ్యసాచి'లో నా ఎడమ చేయి నా అధీనంలో ఉండదు!: చైతూ

నాగచైతన్య రేపు 'యుద్ధం శరణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తనకి హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన చందూ మొండేటితో 'సవ్యసాచి' చేయనున్నాడు. ఈ సినిమాలో తన కుడిచేతికి ఎంత పవర్ ఉంటుందో .. ఎడమ చేతికి కూడా అంతే పవర్ ఉంటుందనీ, అందుకే 'సవ్యసాచి' అనే టైటిల్ పెట్టడం జరిగిందని అన్నాడు.

 పాత్ర పరంగా సినిమాలో తన బ్రెయిన్ కంట్రోల్ లో లెఫ్ట్ హ్యాండ్ ఉండదని చెప్పాడు. తన కంట్రోల్ లో లేకుండా లెఫ్ట్ హ్యాండ్ పనిచేస్తూ ఉంటుందని అన్నాడు. మన శరీరంలోని ఒక అవయవం మన అధీనంలో లేకుండా పోతే ఎలా ఉంటుందన్నదే ఈ సినిమాలో కీలకమని చెప్పాడు. అక్కినేని జయంతి సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెడతామని అన్నాడు.    
nagachaitanya

More Telugu News