: గుర్మీత్ బాబా శిక్ష ఖరీదు ఎంతో తెలుసా?... 200 కోట్ల రూపాయలు!

ఇద్దరు సాధ్విలను అత్యాచారం చేసిన కేసులో డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ శిక్ష మూల్యం ఎంతో తెలుసా?...అక్షరాలా 200 కోట్ల రూపాయలు. గుర్మీత్ బాబాపై ఆరోపణలు రావడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు కలిగిన డేరా బాబాపై అత్యాచార ఆరోపణలను నిర్ధారిస్తూ న్యాయమూర్తి ప్రకటించగానే, ఆయన అనుచరులు పిచ్చెక్కినట్టు ప్రవర్తించారు.

ఆస్తుల విధ్వంసానికి దిగారు. శిక్ష ఖరారైన అనంతరం హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో విధ్వంసం జరిగింది. ఈ విచక్షణారహిత చర్యలో మొత్తం 32 మంది మృతిచెందగా, కనీసం 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌ మెంట్‌ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఒక ప్రభుత్వ పాఠశాల, పవర్‌ సబ్‌ స్టేషన్‌, గోడౌన్‌ లను ఆం‍దోళనకారులు తగులబెట్టారు. ఈ మొత్తం విధ్వంసం ఖరీదు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు అంచనాకు వచ్చాయి. వీటికి ప్రాణ నష్టాలు అదనం అని వారు తెలిపారు. 

More Telugu News