: మా వాడు వచ్చేస్తున్నాడు: నందమూరి బాలకృష్ణ

ప్రస్తుతం హిందూపురంలో ఉన్న సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తన కుమారుడు మోక్షజ్ఞ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ ఉదయం అభిమానులతో కలసి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన, స్వయంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, నందమూరి అభిమానులు మోక్షజ్ఞ లాంచింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, వారందరి కోరిక త్వరలోనే నెరవేరుతుందని చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లినా మోక్షజ్ఞ సినిమా ఎప్పుడన్న ప్రశ్న ఎదురవుతుందని, వచ్చే సంవత్సరం జూన్ కెల్లా ఓ మంచి బ్యానరులో తొలి చిత్రం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

More Telugu News