tamannah: ఇక్కడైనా తమన్నా పారితోషికం తగ్గించేనా?

కొంతకాలం క్రితం హిందీలో కంగనా రనౌత్ చేసిన 'క్వీన్' సూపర్ హిట్ చిత్రంగా భారీ వసూళ్లను సాధించింది. ఆమె కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. అలాంటి ఈ సినిమాను తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో రీమేక్ చేయడానికి ప్రముఖ నటుడు .. నిర్మాత త్యాగరాజన్ రంగంలోకి దిగారు.

తమిళ వెర్షన్ ను తమన్నాతో చేయాలనుకుంటే కుదరలేదు. అందుకు కారణం తమన్నా పారితోషికం ఎక్కువగా అడగడమేననే టాక్ వచ్చింది. దాంతో ఆయన కాజల్ ను తీసుకున్నారు. ఇక తెలుగు రీమేక్ ను తెరకెక్కించే బాధ్యతను ఆయన దర్శకుడు నీలకంఠకు అప్పగించారు. 'మిస్సమ్మ' చిత్రంతో దర్శకుడిగా నీలకంఠ తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తోన్న ఆయన, తమన్నాను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడట. తెలుగు వెర్షన్ కోసమైనా తమన్నా పారితోషికాన్ని తగ్గించుకుంటుందేమో చూడాలి. 
tamannah

More Telugu News