vijay devarakonda: అమెరికాలో 'అర్జున్ రెడ్డి' వసూళ్ల సునామి!

భారీ అంచనాలతో విడుదలైన 'అర్జున్ రెడ్డి' .. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోను వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. రెండో వారంలోను ఈ సినిమా అదే ఊపును కొనసాగిస్తోంది. 'పైసా వసూల్' ప్రభావం పెద్దగా లేకపోవడంతో, 'అర్జున్ రెడ్డి' దూకుడుకి అడ్డుకట్టలేకుండా పోయింది.

 1.5 మిలియన్ మార్కును దాటిన ఈ సినిమా, 2 మిలియన్ మార్క్ దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే 'భలే భలే మగాడివోయ్' రికార్డును అధిగమించి .. అదే జోరుతో ముందుకెళ్తోంది. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు చిత్రాలలో 'అర్జున్ రెడ్డి' 15వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది విడుదలై అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో 11వ స్థానాన్ని ఆక్రమించింది. ఈ వారం మరికొన్ని బాలీవుడ్ సినిమాల రికార్డులను అధిగమించే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు.    

  • Loading...

More Telugu News