vijay devarakonda: 'అర్జున్ రెడ్డి'తో ఒక పాఠం నేర్చుకున్నాను : విజయ్ దేవరకొండ

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అర్జున్ రెడ్డి' తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లోను ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, 'అర్జున్ రెడ్డి' తనకి ఒక విజయాన్ని ఇవ్వడమే కాదు .. ఒక పాఠాన్ని కూడా నేర్పిందని చెప్పాడు. తాను ఎలా వుండాలనుకుంటున్నానో అలాగే ఉండాలనీ, మొహమాటాలకు పోకూడదని నిర్ణయించుకున్నానని అన్నాడు.

 కథ నచ్చకపోతే నచ్చలేదని చెబుతాననీ, డేట్స్ లేవనీ .. సర్దుబాటు కావడం లేదని సాకులు చెప్పనని స్పష్టం చేశాడు. రియలిస్టిక్ గా వుండే పాత్రలే తనకి సరిపడతాయనీ, తన నుంచి అలాంటి పాత్రలనే ఆడియన్స్ ఆశిస్తున్నారని చెప్పాడు. తాను పోషించిన పాత్రలో ప్రతి ఒక్కరూ తమని చూసుకోగలిగినప్పుడే ఆ పాత్ర కనెక్ట్ అయినట్టు అవుతుందనీ, 'అర్జున్ రెడ్డి' విషయంలో అదే జరిగిందని అన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో నాలుగు సినిమాలు వున్నాయి.     
vijay devarakonda

More Telugu News