puri: బాలయ్య విషయంలో అప్పుడు మాత్రం భయపడేవాడిని : పూరి

'పైసా వసూల్' సినిమా సమయంలో బాలకృష్ణతో తనకి ఏర్పడిన అనుబంధాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ చెప్పాడు. సెట్లో బాలకృష్ణ అందరితోనూ ఎంతో కలుపుగోలుగా ఉండేవారనీ, సెట్లోకి వస్తూ .. తిరిగి వెళుతూ ఆయన అందరినీ పలకరిస్తూ ఉండేవారని అన్నాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి వెళ్లేంత వరకూ ఎంతో హ్యాపీగా వుండే తాను, ఆయనతో యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేసినప్పుడు మాత్రం భయపడేవాడినని చెప్పాడు.

ఎందుకంటే, ఒకస్థాయి ఫైట్స్ వరకూ డూప్ లేకుండా చేయడానికే ఆయన ఇష్ట పడతారని అన్నాడు. ఫైట్స్ సమయంలో ఆయన ఎంత మాత్రం ఆలోచించకుండా దూకేస్తుంటారు. అలాంటప్పుడు మాత్రం .. ఆయనకి ఏదైనా అవుతుందేమోనని చాలా భయపడేవాడినని చెప్పాడు. 'పైసా వసూల్' రిజల్ట్ చూశాక మరో సినిమా కలిసి చేద్దామని తాను అంటే, రిజల్ట్ తో పనిలేదు .. మరో సినిమాకి ఏర్పాట్లు చేసుకోమన్న గొప్పవ్యక్తి బాలకృష్ణ అని అన్నాడు.   
puri
balakrishna

More Telugu News