pavan: పవన్ మూవీ టైటిల్ ఏంటనేది దసరాకి చెబుతారట!

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లోని సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్లో, పవన్ .. కీర్తి సురేశ్ కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే బ్యాంకాక్ లోను ..   ఆ తరువాత యూరప్ లోను మేజర్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేశారు.

ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి వుంది. దసరా రోజున టైటిల్ ఏంటనేది ఎనౌన్స్ చేయనున్నారు. ఆల్రెడీ టైటిల్ ను .. క్యాచీగా ఉండేలా ట్యాగ్ లైన్ ను ఫిక్స్ చేశారట. దసరా రోజున టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందని చెబుతున్నారు. అప్పటివరకూ అభిమానులు వెయిట్ చేయవలసిందే. ఈ సినిమాలో పవన్ సరసన మరో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్న సంగతి తెలిసిందే.    
pavan
keerthi

More Telugu News