: బిహార్ వ‌ర‌ద‌ల‌కు కార‌ణం ఎలుక‌లు... జ‌ల‌వ‌న‌రుల మంత్రి లాల‌న్ సింగ్‌ వ్యాఖ్య‌

బిహార్‌లో వ‌స్తున్న వ‌ర‌ద‌ల‌కు ప్ర‌ధాన కార‌ణం ఎలుక‌ల‌ని, ఎలుక‌లు రావ‌డానికి ప‌రోక్ష కార‌ణం రైతుల‌ని జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి లాల‌న్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆయ‌న మాట‌ల‌కు విప‌త్తు నిర్వ‌హ‌ణ మంత్రి దినేశ్ చంద్ర కూడా మ‌ద్ద‌తు ప‌లికారు. `న‌దులు ఉప్పొంగ‌డానికి కార‌ణం ఎలుక‌లు. న‌ది ఒడ్డున రైతులు ధాన్యాల‌ను నిలువ చేస్తున్నారు. వాటి కోసం వ‌చ్చిన ఎలుక‌లు, త‌మ నివాసాల కోసం న‌ది ఒడ్డుపైన క‌లుగులు త‌వ్వుకుంటున్నాయి. దీంతో దృఢంగా ఉండాల్సిన న‌ది ఒడ్డు ప‌ట్టు కోల్పోయి వ‌ర‌దలు సంభిస్తున్నాయి` అని లాల‌న్ సింగ్ అన్నారు. గ‌తంలో కూడా మ‌ద్య‌పాన నిషేధంలో భాగంగా ప‌ట్టుబ‌డిన ఆల్క‌హాల్ బాటిళ్ల‌ను ఎలుక‌లు పాడు చేశాయ‌ని బిహార్ పోలీసులు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News