chiranjeevi: పవన్ కోసం షూటింగ్ స్పాట్ కి వచ్చిన చిరూ దంపతులు!

చిరంజీవి .. పవన్ కల్యాణ్ మధ్య మనస్పర్థలు వున్నాయనే ప్రచారం చాలా కాలం నుంచి జరుగుతోంది. అయితే అవి రాజకీయపరమైన అభిప్రాయ భేదాలే తప్ప, వాళ్లిద్దరి అనుబంధానికి సంబంధించినవి కావనే విషయం చాలాసార్లు స్పష్టమైంది. ఇక ఈ రోజున పవన్ కల్యాణ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. అభిమానుల నుంచి గ్రీటింగ్స్ అందుకుంటూనే, ఈ రోజున కూడా త్రివిక్రమ్ మూవీ షూటింగులో పవన్ పాల్గొంటున్నారు.

 ఆయనని .. ఆ సినిమా యూనిట్ ను సర్ ప్రైజ్ చేస్తూ చిరంజీవి దంపతులు అక్కడికి వచ్చారు. వాళ్ల రాక పట్ల పవన్ ఆనందంతో పొంగిపోయారు. చిరూ దంపతులు పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నావదినల నుంచి పవన్ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సంఘటనతో అక్కడి సెట్ లో పండుగ వాతావరణం నెలకొంది. అన్నదమ్ముల మధ్య ఎలాంటి అరమరికలు లేవనే విషయాన్ని స్పష్టం చేసింది.     
chiranjeevi
pavan

More Telugu News