akshay kumar: అజిత్ హిట్ మూవీ రీమేక్ లో అక్షయ్ కుమార్!

బాలీవుడ్ స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. వరుస హిట్లతో దూసుకుపోతోన్న అక్షయ్ కుమార్, త్వరలో 'వీరమ్' అనే తమిళ సినిమా రీమేక్ లో చేయనున్నట్టు సమాచారం. తమిళంలో అజిత్ చేసిన చెప్పుకోదగిన సినిమాలలో 'వీరమ్' ఒకటి. ఈ సినిమా ఆయన కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా కూడా నిలిచింది.

 అలాంటి ఈ సినిమాను పవన్ కల్యాణ్ హీరోగా 'కాటమ రాయుడు' పేరుతో తెలుగులో రీమేక్ చేశారు గానీ వర్కౌట్ కాలేదు. అయినా 'వీరమ్' కథపై గల నమ్మకంతో ఆ సినిమా రీమేక్ లో చేయడానికి అక్షయ్ కుమార్ రెడీ అవుతున్నాడట. ఈ సినిమాలో తాను కూడా లుంగీ లుక్ తోనే కనిపించాలని ఆయన నిర్ణయించుకోవడం విశేషం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.     
akshay kumar

More Telugu News