kajl: అందుకే కాజల్ 5 కోట్లను వదులుకుందట!

తెలుగులో 'ఖైదీ నెంబర్ 150' .. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాల సక్సెస్ లతో కాజల్ హ్యాపీగా వుంది. ఇక తమిళంలో వచ్చిన 'వివేగం' హిట్ కొట్టడం కూడా ఆమెకి మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు పి.వాసు .. కాజల్ ను కలిసి ఒక కథ చెప్పారట. కథ బాగానే వుంది గానీ .. తనకి చేసే ఉద్దేశం లేదని కాజల్ సమాధానం ఇచ్చింది. ఆమె ఓకే అంటే రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా వున్నారని వాసు చెప్పినా ఆమె అంగీకరించలేదట.

 ఇక తమిళం నుంచే రెండున్నర కోట్లు ఇస్తామంటూ మరో ఆఫర్ వచ్చినా కాజల్ ఇలాగే తిరస్కరించిందట. ఆమె ఆ సినిమాలను వదులుకోవడానికి కారణం .. అవి లేడీ ఓరియెంటెడ్ స్టోరీలు కావడమే. ఆ తరహా సినిమాలు చేసి కెరియర్ ను రిస్క్ వైపు తీసుకెళ్లడం ఇష్టం లేకనే కాజల్ 5 కోట్లను వదులుకున్నట్టు తెలుస్తోంది. హీరో ప్రధానంగా నడిచే సినిమాల్లో మాత్రమే చేయాలని ఆమె బలంగా నిర్ణయించుకుందట.       

More Telugu News