anu emmanuel: ఇబ్బందే .. అయినా ఈ ప్రొఫెషన్ అంటే ఇష్టమే : అనూ ఇమ్మాన్యుయేల్

ఇటీవల కాలంలో తెలుగు తెరను పలకరించిన అందమైన కథానాయికలలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు. 'మజ్ను' .. 'కిట్టు వున్నాడు జాగ్రత్త' సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ సుందరి, ప్రస్తుతం పవన్ సరసన ఒక సినిమా చేస్తోంది. తాజాగా ఓ సందర్భంలో అనూ మాట్లాడుతూ, చిత్రపరిశ్రమలో రాణించడం అంత తేలికైన విషయం కాదని చెప్పింది.

కథలు విన్న తరువాత ఒక నిర్ణయానికి రావడం చాలా కష్టమని అంది. అదే విధంగా అనుకూలంగా లేని షెడ్యూల్స్ ను అనుసరించడం కూడా చాలా ఇబ్బందేనని చెప్పింది. ఇక షూటింగ్స్ వలన కుటుంబ సభ్యులందరికీ దూరంగా ఉండటం మరీ కష్టమని అంది. రకరకాల వ్యక్తులు తారసపడుతూ ఉంటారనీ, ఒక్కొక్కరినీ ఒక్కోలా ట్రీట్ చేయాల్సి వస్తుంటుందని చెప్పింది. ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పటికీ ఈ ప్రొఫెషన్ అంటే తనకి ఎంతో ఇష్టమంటూ చెప్పుకొచ్చింది.     
anu emmanuel

More Telugu News