: మూడు దేశాల్లో వరద బాధితులకు ‘గూగుల్’ సాయం

భారత్, నేపాల్, బంగ్లాదేశ్ లోని వరద బాధితులకు సాయం చేసేందుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది. ‘గూంజ్’, ‘సేవ్ ద చిల్డ్రన్’ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ సాయాన్ని అందించనున్నట్టు ‘గూగుల్’ ప్రకటించింది. కాగా,  ఈ మూడు దేశాల్లోని లక్షా అరవై వేల మంది వరద బాధితులకు ఆహారం, జీవనోపాధి, తాత్కాలిక నివాసం, తాగునీరును ‘సేవ్ ద చిల్డ్రన్’ ద్వారా, భారత్ లోని 75 వేల వరద బాధిత కుటుంబాలకు ఆహారం, దుప్పట్లు, ఇతర సామగ్రిని ‘గూంజ్’ ద్వారా అందించనుంది.

More Telugu News