nagachaitanya: రెండు కొత్త సినిమాలకి శ్రీకారం చుట్టిన సితార ఎంటర్టైన్మెంట్స్

విజయవంతమైన చిత్రాలను అందిస్తూ ప్రేక్షకుల్లో నమ్మకాన్ని సంపాదించుకున్న నిర్మాణ సంస్థగా హారిక అండ్ హాసిని పేరు తెచ్చుకుంది. ఈ సంస్థకి అనుబంధ సంస్థగా సితారా ఎంటర్టైన్మెంట్స్ కొనసాగుతోంది. ఈ బ్యానర్ కొత్తగా రెండు సినిమాలకి శ్రీకారం చుట్టింది. మారుతి - నాగ చైతన్య కాంబినేషన్లో ఒక సినిమా, సుధీర్ వర్మ - శర్వానంద్ కాంబినేషన్లో ఒక సినిమాను నిర్మిస్తున్నట్టుగా నిర్మాతలు తెలియజేశారు.

 ఈ రెండు యూత్ కి సంబంధించిన సినిమాలే కావడం విశేషం. ఒక వైపున నాగచైతన్య .. మరోవైపున శర్వానంద్ ఇద్దరూ కూడా సక్సెస్ లతో ముందుకు దూసుకుపోతున్నవారే. అలాంటి హీరోలతో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సినిమాలను ప్లాన్ చేశారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడి చేస్తామని చెప్పారు.  

  • Loading...

More Telugu News