sai dharam tej: వినాయక్ మూవీలో సెకండాఫ్ సాయిధరమ్ తేజ్ కి నచ్చలేదట!

కొంతకాలంగా సాయిధరమ్ తేజ్ కి సరైన హిట్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడనే విషయం అభిమానులకి ఆనందాన్ని కలిగించింది. మాస్ మసాలా సినిమాలని జనరంజకంగా తెరకెక్కించడంలో వినాయక్ సిద్ధహస్తుడు. అందువలన ఆయన సినిమాతో తేజుకి తప్పకుండా ఒక హిట్ పడినట్టేనని అనుకున్నారు.

ఈ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకి ఆకుల శివ కథను సిద్ధం చేశాడు. కథ విన్న తరువాత సెకండాఫ్ విషయంలో తేజు కొంత అసంతృప్తిని వ్యక్తం చేశాడనే టాక్ వినిపిస్తోంది. కొన్ని చోట్ల తేజు మార్పులు, చేర్పులు సూచించాడట. ప్రస్తుతం అవి చేసే పనిలో ఆకుల శివ వున్నాడని అంటున్నారు. ఈ కారణంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టేలా వుందని చెబుతున్నారు.  
sai dharam tej

More Telugu News