gopichand: గోపీచంద్ సినిమా: 30 కోట్లు పెడితే 10 కోట్లు మాత్రమే వచ్చాయట!

యాక్షన్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన గోపీచంద్ కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన 'గౌతమ్ నంద'పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా ఫలితం కూడా ఆయనను పూర్తిగా నిరాశ పరిచింది. కొత్తదనంతో కూడిన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.

 రిలీజ్ కి ముందు .. ఈ సినిమా 30 కోట్ల వరకూ బిజినెస్ చేసిందనే వార్తలు షికారు చేశాయి. దాంతో ఆ స్థాయి వసూళ్లు సాధ్యమేనా? అనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపించింది కూడా. ఈ సినిమా బిజినెస్ విషయంలో వచ్చిన వార్తలే నిజమైతే, బయ్యర్లకి భారీగా నష్టాలు వచ్చినట్టేనని అనుకోవాలి. ఎందుకంటే .. ప్రపంచవ్యాప్తంగా ఫుల్ రన్ లో ఈ సినిమా 10.3 కోట్లను మాత్రమే వసూలు చేసిందట. గోపీచంద్ జోడీగా హన్సిక .. కేథరిన్ కథానాయికలుగా చేశారనే సంగతి తెలిసిందే.      

More Telugu News