vijay devarakonda: విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ పెంచనున్నాడా?

'పెళ్లిచూపులు ' సినిమాతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండకి యూత్ లో క్రేజ్ వచ్చింది. ఇక రీసెంట్ గా వచ్చిన 'అర్జున్ రెడ్డి' సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు, యూత్ లో ఆయనకి గల క్రేజ్ ను అమాంతంగా పెంచేసింది. ఈ సినిమా తరువాత దాదాపు ఆయన ఓ అరడజను సినిమాలు ఒప్పేసుకున్నాడు. అల్లు అరవింద్ తో పాటు కొంతమంది నిర్మాతలు విజయ్ దేవరకొండతో అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారని వినికిడి.

''అర్జున్ రెడ్డి' సినిమాతో ఒక్కసారిగా తనకి స్టార్ డమ్ వచ్చేయడంతో, దానికి తగినట్టుగా రెమ్యునరేషన్ అందుకోవాలని విజయ్ దేవరకొండ అనుకుంటున్నట్టుగా టాక్. అయితే ఆల్రెడీ కమిటైన సినిమాల నుంచే పెంచిన రెమ్యునరేషన్ ను రాబడతాడా? ఆ తరువాత తాను చేయనున్న సినిమాల నుంచి మొదలెడతాడా? అనే విషయం తెలియాల్సి వుంది.       
vijay devarakonda

More Telugu News