: అమెరికా బేస్ ను లక్ష్యం చేసుకునే క్షిపణి పరీక్ష నిర్వహించాం: ఉత్తరకొరియా అధికారిక ప్రకటన

క్షిపణి పరీక్షపై ఉత్తరకొరియా స్పందిస్తూ, అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో గ్వామ్ ద్వీపాన్ని లక్ష్యం చేసుకుని క్షిపణి పరీక్ష నిర్వహించాలని కిమ్ ఆదేశించారని తెలిపింది. తాము పరీక్షించిన క్షిపణి మధ్య శ్రేణి క్షిపణి అని, దాని పేరు హస్వాంగ్-12 అని ప్రకటించింది. కిమ్ ఆదేశించినట్టే ప్యాంగ్ యాంగ్ నుంచి జపాన్‌ ఉత్తర భూభాగం మీదుగా ఉత్తర పసిఫిక్‌ మహా సముద్రంలోకి ఈ క్షిపణిని ప్రయోగించామని స్పష్టం చేసింది.

ఈ దిశగా ఇదే తొలి క్షిపణి అని, ఇలాగే మరిన్ని క్షిపణి పరీక్షలు నిర్వహిస్తామని ఉత్తరకొరియా తెలిపింది. 1.60 లక్షల జనాభాగల గ్వామ్ ద్వీపాన్ని సర్వనాశనం చేసేందుకు హస్వాంగ్‌-12 రకానికి చెందిన నాలుగు క్షిపణులను ప్రయోగిస్తామని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, గ్వామ్‌ ద్వీపంలో అమెరికా నేవీ, ఎయిర్ ఫోర్స్ బేస్ లు ఉన్నాయి. 

More Telugu News