ntr: ఎన్టీఆర్ తో బండ్ల గణేష్ సినిమా రూమరేనట!

నిర్మాతగా బండ్ల గణేశ్ భారీ సినిమాలు చేస్తూ వెళ్లాడు. ఎన్టీఆర్ తో ఆయన 'బాద్షా', 'టెంపర్' సినిమాలు చేశాడు. 'బాద్షా' పరాజయంపాలు కాగా, 'టెంపర్' ఓ మాదిరిగా ఆడింది. ఈ సినిమాల సమయంలోనే ఎన్టీఆర్, బండ్ల గణేశ్ మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా వార్తలు షికారు చేశాయి.

అయితే ఆ విషయాలనన్నింటిని పక్కన పెట్టేసి... మళ్లీ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి బండ్ల గణేశ్ ప్రయత్నిస్తున్నాడంటూ ఓ ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్, కొరటాల ప్రాజెక్టుల తరువాత బండ్ల గణేశ్ సినిమాను ఎన్టీఆర్ చేసే ఛాన్స్ వుందని చెప్పుకుంటున్నారు. ఈ వార్తలో ఎంత మాత్రం నిజం లేదనీ... ఇదంతా కేవలం పుకారు మాత్రమేననేది ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల మాట. ఇక బండ్ల గణేశ్ తో ఎన్టీఆర్ సినిమా లేనట్టేనని చెప్పుకోవచ్చు.  

ntr

More Telugu News