nagachaitanya: 'యుద్ధం శరణం' కోసం అభిమానుల ముందుకు చైతూ!

వైవిధ్యభరితమైన కథాంశాలకు ప్రాధాన్యతనిస్తూ .. విజయాలను సొంతం చేసుకుంటూ నాగచైతన్య ముందుకుసాగుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా తెరకెక్కిన 'యుద్ధం శరణం' వచ్చేనెల 8వ తేదీన విడుదలకి ముస్తాబవుతోంది. మారి ముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లావణ్యత్రిపాఠి కథానాయికగా నటించింది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ కోసం చైతూ రంగంలోకి దిగాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి అభిమానులను .. ప్రేక్షకులను చైతూ కలుసుకోనున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారని అంటున్నారు. త్వరలోనే ఆ టూర్ వివరాలు తెలియజేస్తారట.  
nagachaitanya
lavanya

More Telugu News