keerthi: 'మహానటి' సినిమా ఓవర్సీస్ కి భారీ ఆఫర్!

'మహానటి' సినిమాలో సావిత్రి పాత్రను కీర్తి సురేశ్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగ్ దశలో వుంది. దర్శకుడు నాగ అశ్విన్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకోవడానికిగాను నిర్వాణ సినిమాస్ వారు 4.5 కోట్లను ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది.

 కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాకి ఇది పెద్ద ఆఫరేనని అంటున్నారు. ఓవర్సీస్ లో 'ఆనందో బ్రహ్మ' .. 'అర్జున్ రెడ్డి' సినిమాలను రిలీజ్ చేసి లాభాలను చూసిన నిర్వాణ సినిమాస్, ఈ సినిమాకి భారీ ఆఫరే ఇచ్చారు. భారీ బడ్జెట్ తో కొనసాగుతోన్న ఈ సినిమా షూటింగులో ఇంతవరకూ ప్రకాశ్ రాజ్ .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండ జాయిన్ అయ్యారు. మరికొన్ని పాత్రల కోసం మరికొంతమందిని ఎంపిక చేయాల్సి వుంది.    
keerthi
dulkar

More Telugu News