ajith: రెండు రోజుల్లో 60 కోట్లు వసూలు.. అజిత్ క్రేజ్ అలాంటిది మరి!

కోలీవుడ్ అగ్రకథానాయకుడిగా అజిత్ కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన తాజా చిత్రంగా ఈ నెల 24వ తేదీన 'వివేగం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా కాజల్ అలరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 3000 థియేటర్స్ లో విడుదల చేశారు.

కేవలం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 60 కోట్లను సాధించింది. 100 కోట్ల క్లబ్ లో చేరడానికి ఎన్నో రోజులు పట్టదని అంచనా వేస్తున్నారు. దర్శకుడు శివ - అజిత్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా, వాళ్లకి హ్యాట్రిక్ హిట్ ఇచ్చింది. అజిత్ లాంటి హీరోతో కలిసి హిట్ కొట్టినందుకు కాజల్ ఫుల్ ఖుషీ అవుతోంది. తాము ఆశించినట్టుగానే ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం పట్ల అజిత్ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.      

More Telugu News