sharvanand: మాఫియా నేపథ్యంలో శర్వానంద్ మూవీ!

విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు శర్వానంద్ కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' చేస్తోన్న ఆయన, తన తదుపరి సినిమాను సుధీర్ వర్మ దర్శకత్వంలో చేయనున్నాడు. 'స్వామిరారా' .. 'కేశవ' వంటి చిత్రాల ద్వారా దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న ఆయన, శర్వానంద్ తో సినిమా చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

 ఈ సినిమాలో కథానాయకుడు ఒక సామాన్యుడిగా తన జీవితాన్ని మొదలుపెట్టి, మాఫియా సామ్రాజ్యానికి అధినేతగా ఎదుగుతాడు. కథను బట్టి ఆయా వయసులవారీగా శర్వానంద్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఒక్కో దశలో ఒక్కో లుక్ తో ఆయన కనిపించనుండటం విశేషం. సెప్టెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారు. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.  
sharvanand

More Telugu News