: గెట్ రెడీ ఫర్ వార్... సైన్యానికి ట్రంప్ సూచన

నార్త్ కొరియాతో దేశ భద్రతకు ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడితే, దాడికి వెనుకాడవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సైన్యానికి సూచించారు. అమెరికాతో పాటు దక్షిణ కొరియా కూడా ఉత్తర కొరియాను రెచ్చగొట్టేలా తొలి వ్యాఖ్యలు, చర్యలు చేబట్టవద్దని పేర్కొన్న ట్రంప్, సైన్యం మాత్రం యుద్ధం చేయడానికి ఏ క్షణమైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని ట్రంప్ తెలిపినట్టు అమెరికా రక్షణ శాఖ మంత్రి టెల్లర్సన్ తెలిపారు. తాము ఎదురుచూస్తున్న సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు.

 కాగా, శనివారం నాడు ఉత్తర కొరియా మూడు ఖండాంతర క్షిపణులను ప్రయోగించగా, అవి దక్షిణ కొరియాకు 240 కిలోమీటర్ల దూరంలోని పసిఫిక్ మహా సముద్రంలో పడిన సంగతి తెలిసిందే. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ట్రంప్, ఈ తాజా ప్రయోగాల వెనుక కిమ్ జాంగ్ వ్యూహంపై అడిగి తెలుసుకున్నట్టు 'న్యూయార్క్ టైమ్స్' తెలిపింది.

More Telugu News