: నల్గొండ జిల్లాలో డేరా బాబా 9 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం

నల్గొండ జిల్లాలో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ గతంలో కొనుగోలు చేసిన 9 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ భూమి అసైన్డ్ ల్యాండ్ అని నిర్ధారణ కావడం, చుట్టుపక్కల రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో చిట్యాల మండలం ఎలిమినేడులో 65వ జాతీయ రహదారిపై ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తహసీల్దార్ వెల్లడించారు.

కాగా, నల్గొండ జిల్లాలో 2008 నుంచి 2015 మధ్య రూ. 30 కోట్ల విలువైన 55 ఎకరాల భూమిని గుర్మీత్ కొనుగోలు చేశారన్న సంగతి తెలిసిందే. ఈ భూమి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ లు పురుషోత్తమ్ లాల్, కిషన్ సేవాధార పేరిట ఉంది. మరో 18 ఎకరాల అసైన్డ్ భూమి కూడా గుర్మీత్ ట్రస్ట్ పేరిట ఉందని తెలుసుకున్న రెవెన్యూ శాఖ, నోటీసులు పంపింది. కాగా, ఈ భూమిని కొనుగోలు చేసి, సేవా కార్యక్రమాల నిమిత్తం ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన వర్గం చెబుతున్నా, ఒక్కసారి కూడా గుర్మీత్ రామ్ ఇక్కడికి రాకపోవడం గమనార్హం.

More Telugu News