varun tej: కంటెంట్ వున్న సినిమాలకి కాసుల వర్షమే!

పెద్ద సినిమా .. చిన్న సినిమాల మధ్య గల గీత ఈ మధ్య కాలంలో చెరిగిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే భారీ బడ్జెట్ చిత్రాలే అయినా .. భారీ తారాగణమే వున్నా కంటెంట్ లేకపోతే ఆడియన్స్ ఆదరణ పొందడం కష్టమే అవుతోంది. ఇక స్టార్ హీరో హీరోయిన్లు లేకపోయినా కంటెంట్ ఉంటే చాలు థియేటర్స్ ను హౌస్ ఫుల్ చేసేస్తున్నారు .. కాసుల వర్షాన్ని కురిపిస్తున్నారు.

 రీసెంట్ గా వచ్చిన 'ఫిదా' .. నేనే రాజు నేనే మంత్రి' .. ' ఆనందో బ్రహ్మ' సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఓవర్సీస్ లో 'ఫిదా' ఈ నెల 24వ తేదీ నాటికి 13.14 కోట్లను రాబట్టింది. ఇక ఆ తరువాత థియేటర్స్ కి వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' 3.97 కోట్లను వసూలు చేయగా .. రీసెంట్ గా ప్రేక్షకులను పలకరించిన 'ఆనందో బ్రహ్మ' 2.25 కోట్లను కొల్లగొట్టింది. మొత్తానికి ఓవర్సీస్ లో ఇప్పుడు చిన్న చిత్రాల పెద్ద పండుగ జరుగుతోంది.   

More Telugu News