charan: 'సైరా' కారణంగా 'రంగస్థలం' లేట్ కానుందా?

సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' షూటింగ్ చకచకా జరుగుతూ వచ్చింది. దాంతో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. సంక్రాంతికి పవన్ సినిమా ఉండటంతో, చెర్రీ సినిమా డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ దాదాపు 3 నెలలకి పైగా వాయిదా పడే అవకాశాలు వున్నాయనేది తాజా సమాచారం.

 సుకుమార్ తాను నిర్మాతగా తెరకెక్కించిన 'దర్శకుడు' ప్రమోషన్స్ కోసం కొన్ని రోజులు కేటాయించడం వలన కొన్ని షెడ్యూల్స్ అనుకున్నట్టుగా జరగలేదట. ఇక 'సైరా నరసింహా రెడ్డి' సినిమాకి నిర్మాతగా వున్న చరణ్, ఆ సినిమా పనుల్లో బిజీగా ఉండటం వలన తాజా షెడ్యూల్స్ లో మార్పులు జరిగాయట. ఈ కారణంగా 'రంగస్థలం' సినిమాను ఏప్రిల్ కి వాయిదా వేశారనీ, ఆ నెల 20వ తేదీన విడుదల చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. చరణ్ ఫ్యాన్స్ కి ఇది కాస్త నిరుత్సాహాన్ని కలిగించే విషయమే.    
charan
samanta

More Telugu News