: నేడు ఏపీకి తొలిసారి ఉపరాష్ట్రపతి.. లక్షమందితో ఘన స్వాగతం పలకనున్న చంద్రబాబు!

తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు‌కు ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఉదయం 9 గంటలకు ఉపరాష్ట్రపతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు.

అలాగే విమానాశ్రయం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు లక్షమందితో భారీ మానవహారం ఏర్పాటు చేయనున్నారు. ఈ మానవహారం దాదాపు 23 కిలోమీటర్ల మేర ఏర్పడనుంది. గన్నవరం నుంచి వెలగపూడిలోని సభా వేదిక వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ దారి పొడవునా వెంకయ్యకు పూలతో స్వాగతం పలకనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సభా వేదిక వద్దకు చేరుకున్న తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్య 2.25 లక్షల ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేస్తారు. సన్మానం అనంతరం సచివాలయంలో గవర్నర్, సీఎంలతో కలిసి లంచ్ చేస్తారు. అనంతరం తెనాలిలో జరిగే కార్యక్రమానికి బయలుదేరుతారు.

More Telugu News