: గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ పేరున 19 గిన్నిస్ రికార్డులు

రేప్ కేసులో దోషిగా కోర్టు నిర్ధారించిన‌ ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ పేరు మీద 2003 నుంచి 2015 మ‌ధ్య‌ 19 గిన్నిస్ బుక్ రికార్డులు రిజిస్ట‌రై ఉన్నాయి. 15,432 మంది ర‌క్త‌దాత‌ల‌తో క్యాంప్ ఏర్పాటు చేసి 2003, డిసెంబ‌ర్ 3న గుర్మీత్ మొద‌టి గిన్నిస్ రికార్డు న‌మోదు చేశారు. 2004లో మ‌ళ్లీ ర‌క్త‌దానంలో 17,921 దాత‌లతో పాత రికార్డును బ్రేక్ చేశారు. త‌ర్వాత 2009లో 9,38,007 చెట్లు నాటించే కార్య‌క్ర‌మంతో ద్వారా రెండు రికార్డులు, మ‌ళ్లీ 2010లో ర‌క్త‌దానంలో 43,732 దాత‌ల‌తో మ‌రో రికార్డు, 4,603 మంది ఉచిత కంటి ప‌రీక్ష‌లు చేసే క్యాంపు ఏర్పాటు చేసి ఒక రికార్డు ఆయ‌న పేరు మీద ఉన్నాయి.

 వీటితో పాటు మొక్క‌లు నాట‌డం, నాణేలు గాల్లోకి ఎగుర‌వేయడం, డాప్ల‌ర్ అల్ట్రాసౌండ్ ప‌రీక్ష‌ల క్యాంప్ నిర్వ‌హ‌ణ‌, బీపీ న‌మోదు క్యాంపు నిర్వ‌హ‌ణ‌, షుగ‌ర్ వ్యాధి చెక‌ప్ క్యాంపు నిర్వ‌హ‌ణ‌, కొలెస్ట్రాల్ ప‌రీక్ష‌ల క్యాంపు నిర్వ‌హ‌ణ‌, చేతి ప‌రిశుభ్ర‌త క్యాంపు నిర్వ‌హ‌ణ‌, ఫింగ‌ర్ పెయింటింగ్ పోటీ నిర్వ‌హ‌ణ‌, అతిపెద్ద మాన‌వహారం నిర్వ‌హ‌ణ‌, కూరగాయ‌ల‌తో బొమ్మ‌ల పోటీ నిర్వ‌హ‌ణ‌, అతిపెద్ద గ్రీటింగ్ కార్డు, పోస్ట‌ర్ వంటి 19 గిన్నిస్ రికార్డులు గుర్మీత్ సింగ్ పేరు మీద ఉన్నాయి.

More Telugu News