chiranjeevi: రాజమౌళి తరహాలోనే గోప్యత పాటించనున్న 'సైరా' టీమ్!

చిరంజీవి 151వ మూవీ టైటిల్ గా 'సైరా నరసింహా రెడ్డి'ని ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ముఖ్య తారాగణం వివరాలను తెలియజేశారు. ఇక ఇక్కడి నుంచి ఈ సినిమా టీమ్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తుందట. సినిమా వివరాలు .. విశేషాలు తాము ఎనౌన్స్ చేసేంతవరకూ బయటికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట.

 ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నవారు సైతం ఈ సినిమాలో తమ పాత్రల తీరు తెన్నులకి సంబంధించిన వివరాలను గోప్యంగా వుంచవలసిందే. 'బాహుబలి' విషయంలో రాజమౌళి ఇదే పద్ధతిని పాటిస్తూ వచ్చారు. ఆయా పాత్రధారులకి సంబంధించిన ఒక్కో లుక్ ను ఆయన రిలీజ్ చేసే వరకూ ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది ఎవరికీ తెలియదు. అదే పద్ధతిని పాటిస్తూ .. ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచాలనే నిర్ణయానికి 'సైరా' టీమ్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.     
chiranjeevi
nayanatara

More Telugu News